చిరంజీవి చేతులమీదుగా 'జీ' తెలుగు సినిమా లోగో ఆవిష్కరణ

శుక్రవారం, 19 ఆగస్టు 2016 (11:51 IST)
మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఓపెన్‌ చేయాలంటే ఇండస్ట్రీలో భయపడుతుంటారు. కానీ కొందరు ఆయన మీద గౌరవంతో ఓపెనింగ్‌ చేస్తుంటారు. తాజాగా జీ సినిమాలు అనే కొత్త ఛానల్‌ను చిరంజీవి జీ-సినిమాలు లోగోను ఆవిష్కరించారు. జీ తెలుగు నెంబర్‌వన్‌గా అవతరించింది. 11 ఏళ్ళ సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తిచేస్తున్న సందర్భంగా 'జీ సినిమాలు' పేరుతో పూర్తిస్థాయి మూవీ ఛానల్‌ ప్రారంభించింది. 
 
తెలుగు ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని సరికొత్త అనుభూతులు, ఆస్వాదనలతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పూర్తిస్థాయి సినిమా ఛానెల్‌గా సిద్ధమైంది. తొలిసారిగా మూవీ చానెల్‌తోపాటు తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఒకేసారి వెబ్‌సైట్‌ను తీసుకొచ్చి టాలీవుడ్‌కు చెందిన అప్‌డేట్స్‌, బాక్సాఫీస్ వివరాలు, సమీక్షలు వంటి సమాచారాన్ని తీసుకొస్తుంది. ఈనెల 17న టెస్ట్‌ సిగ్నల్‌ ప్రారంభమైంది. సెప్టెంబర్‌ 4న 12 గంటల 5 నిముషాలకు జీ సినిమాలు పూర్తిస్థాయి సినిమా చానెల్‌ లాంగ్‌ అవుతుంది. 

వెబ్దునియా పై చదవండి