చిరంజీవిని అనుకరించిన మంచు మనోజ్‌

సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (21:54 IST)
మంచు మనోజ్‌ నటిస్తుంటే.. మోహన్‌ బాబును అనుకరిస్తున్నట్లు కన్పిస్తుంది. మాట తీరు, మాడ్యులేషన్‌.. స్టైల్‌ అంతా అదేటైపు. కానీ.. ప్రస్తుతం చిరంజీవిని అనుకరించినట్లుగా కొత్త చిత్రం రాబోతోంది. మంచు మనోజ్‌ నటించిన 'గుంటూరోడు' సినిమాకు చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ అందించారు. 
 
చిత్ర కథ, పాత్రల పరిచయ సన్నివేశాలకు చిరంజీవి తన మాస్‌ శైలిలో వాయిస్‌ ఇవ్వడం జరిగిందని చిత్ర దర్శకుడు సత్య తెలియజేశారు. ఈ సందర్భంగా చిరంజీవికి కృతజ్ఞతలు తెలియజేస్తూ... మార్చి 3న రానున్న ఈ చిత్రం చిరంజీవి ఫ్యాన్స్‌కి దగ్గరవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాగా, ఇందులో మనోజ్‌ పాత్ర చిరంజీవి శైలిని అనుకరించేట్లు వుంటుందని చిత్ర యూనిట్‌ తెలియజేస్తుంది. అందుకే చిరంజీవి వాయిస్‌ఓవర్‌ ఇచ్చాడన్నమాట.

వెబ్దునియా పై చదవండి