"శేఖర్" సినిమాకు కోర్టు కష్టాలు.. సినిమా ప్రదర్శన నిలిపివేత

ఆదివారం, 22 మే 2022 (17:23 IST)
డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటించిన తాజా చిత్రం "శేఖర్". జీవిత రాజశేఖర్ నిర్మాతలు. ఇపుడు ఈ చిత్రానికి కోర్టు షాకిచ్చింది. ఈ చిత్ర ప్రదర్శను తక్షణం నిలిపివేయాలంటూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీచేసింది. దీంతో చిత్రప్రదర్శన ఆగిపోయింది. 
 
రాజశేఖర్ తనకు డబ్బులు ఇవ్వాలని ఫైనాన్షియర్ పరంథామ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. దీంతో తక్షణం ఆయనకు డబ్బులు చెల్లించాలంటూ కోర్టు ఆదేశించింది. అయినప్పటికీ చిత్ర నిర్మాతలు ఆయనకు డబ్బులు చెల్లించలేదు. దీంతో ఫైనాన్షియర్ మళ్లీ కోర్టును ఆశ్రయించారు. 
 
తనకు ఇవ్వాల్సిన డబ్బులను ఆదివారం సాయంత్రం 4 గంటలలోపు కోర్టులో సెక్యూరిటీ డిపాజిటి చేయాలని లేనిపక్షంలో, సినిమాపై హక్కులన్నీ తనకే ఇవ్వాలని పరంథామరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌లో కోరారు. ఆ మేరకు కోర్టు తీర్పు కూడా వెలువడింది. దీన్ని విచారించిన కోర్టు సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని ఆదేశించింది. 
 
ఈ కోర్టు తీర్పుపై హీరో రాజశేఖర్ స్పందించారు. తన సినిమాను కొందరు కుట్రపన్ని అడ్డుకున్నారని చెప్పారు. ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని తెరకెక్కించామన్నారు. సినిమానే తమకు జీవితమన్నారు. ఈ శేఖర్ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నామన్నారు. ఇలాంటి సమయంలో ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదని పేర్కొంటూ రాజశేఖర్ ట్వీట్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు