తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలు నటించేవారిని బాబు అను సంబోధించడం అనాదిగా వస్తున్న ఆచారం. పేర్లలోనే మహేష్‌బాబు, జగపతిబాబు, రఘుబాబు, గిరిబాబు, వెంకటేష్‌బాబు ఇలా ఉన్నవారు కొందరైతే.. ఇప్పుడు కొత్తగా వస్తున్న హీరోలను కూడా బాబు అని సరదాగా సంబోధిస్తూ.. సెటైర్‌లు కూడా వేసుకుంటున్నారు.
కొత్తగా కమేడియన్ పృథ్వీ.. హీరోగా చేస్తున్నాడు. సలోని పక్క హీరోగా చేస్తున్న ఆ సినిమా 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. సత్తిబాబు దర్శకుడు. రాధామోహన్ నిర్మాత. ఈ చిత్రంలోని పృథ్వీ పాత్ర గురించి ఆడియోవేడుకలో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీకి మరో పృధ్వీ బాబు రాబోతున్నాడు. సాంగ్స్‌లో డాన్స్ ఇరగదీశాడు పృధ్వీ. మా జనరేషన్‌కి కాంపిటీషన్ కాబోతున్నాడు. అంత బాగా డాన్స్ చేశాడు.
ఈ చిత్రం ట్రైలర్ ఫెంటాస్టిక్‌గా ఉంది. ఫుల్ మీల్స్‌లా ఉంది. నవీన్‌చంద్ర క్లోజ్ ఫ్రెండ్. మంచి హార్డ్‌వర్క్ యాక్టర్. ఈ సినిమాతో అతనికి మంచి హిట్ వస్తుంది. వసంత్ నా రెండు సినిమాలకి మంచి మ్యూజిక్ అందించాడు. సత్తిబాబుకి కామెడీ మీద మంచి పట్టు ఉంది. ఈ కథ నాకు తెలుసు. హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ చిత్రం బిగ్ హిట్ అవుతుంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్'' అన్నారు.