''భరత్ అనే నేను''పై ఆ పార్టీ నేత ఫిర్యాదు.. ఇంతకీ ఎవరతను?

మంగళవారం, 5 జూన్ 2018 (09:31 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ''భరత్ అనే నేను'' సినిమా బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై నవోదయం పార్టీ నేత ఫిర్యాదు చేశారు. భరత్ అనే నేనులో నవోదయం పార్టీపై దుష్ప్రచారం చేశారని గుంటూరు అర్బన్ ఎస్పీకి ఆ పార్టీ అధ్యక్షుడు నల్లకరాజు ఫిర్యాదు చేశారు. భరత్ అనే నేను సినిమా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. 
 
ఈ సినిమాలో నవోదయం పార్టీ పట్ల ప్రజల్లో ద్వేషం కలిగించేలా చూపించారని నల్లకరాజు ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ పార్టీ పేరును వాడుకోవడమే కాకుండా పార్టీ జెండాలో ఉన్న ఉదయించే సూర్యుడు గుర్తుని దుర్వినియోగం చేశారన్నారు. 
 
ఈ సందర్భంగా ఎస్పీని కలిసిన నల్లకరాజు సినిమాపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. నవోదయం పార్టీని 2010లో స్థాపించి కేంద్ర ఎన్నికల కమిషన్‌తో రిజిస్ట్రేషన్‌ కూడా చేయించామని నల్లకరాజు గుర్తు చేశారు. కాగా  భరత్ అనే నేను సినిమా దాదాపు 200 కోట్లు గ్రాస్ వసూల్ చేసిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు