ప్రముఖ యువనటులు నాగచైతన్య, సమంత వివాహంపై సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అక్టోబర్ 6న వివాహంతో వీరిద్దరూ దంపతులు కానున్నారని వార్తలు వస్తున్నాయి. రారండోయ్ వేడుక చూద్దాం.. సినిమా ప్రమోషన్ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ.. తమ వివాహం అక్టోబర్ రెండు లేదా మూడో వారంలో ఉంటుందని చెప్పారు. కానీ డేట్ ఇంకా అనుకోలేదని చైతూ వెల్లడించారు.
ఈ చిత్రం ఆడియో సీడీలను ఆవిష్కరించిన అనంతరం నాగార్జున మాట్లాడుతూ, ఈ సినిమాలో చక్కటి పల్లెటూరి పిల్లలాగా రకుల్ ప్రీత్ సింగ్ ఓణీలు వేసుకుంటుంది. ఈ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ చాలా బాగుందని కితాబిచ్చారు. రారండోయ్ సినిమా ద్వారా తప్పకుండా హిట్ కొడతామని నాగ్ వ్యాఖ్యానించారు.