అవి వల్గర్ - డెరోగేటరీ డ్యాన్సులు.. వాటిని అనుమతించాలా? మహారాష్ట్ర

బుధవారం, 11 జనవరి 2017 (09:31 IST)
తమ రాష్ట్రంలో ఉన్న బార్లలో అశ్లీల నృత్యాలపై విధించిన నిషేధాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం సమర్థించుకుంది. అవి వల్గర్, డెరోగేటరీ డ్యాన్సులని, అవి మహిళలను కించపరిచేలా ఉంటాయని పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు తెలిపింది. బార్లలో డ్యాన్సులు నిషేధించడాన్ని సవాల్ చేస్తూ మహారాష్ట్ర బార్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెల్సిందే. 
 
బార్లలో అమ్మాయిలు చేసే డ్యాన్సు‌లు ఆర్ట్ (కళాత్మక) నృత్యాలు కావని, అవి అసభ్యకరమైనవి. అవి వల్గర్, డెరోగేటరీ (మహిళలను కించపరిచే నృత్యాలు) నృత్యాలు. బార్ యువతుల గౌరవాన్ని కాపాడవలసిన అవసరం ఉంది. బార్లలో డ్యాన్సుల ప్రదర్శనపై ఆంక్షలు విధించాలన్న తమ నిర్ణయం సబబే అని సమర్థించుకుంది. 
 
చాలా సందర్భాల్లో బార్ డ్యాన్సులను వ్యభిచార రాకెట్లుగా ఓనర్లు ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటివాటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది అని ప్రభుత్వ తరపు న్యాయవాది వ్యాఖ్యానించారు. బార్లలో డ్యాన్సులు చేస్తున్న అమ్మాయిలు శిక్షణ పొందినవారు కారని, వారి నృత్యాల్లో కళాత్మకత లేకపోగా అసభ్యంగా, అశ్లీలంగా ఉంటున్నాయని, అందుకే వీటిని నిషేధిస్తూ చట్టం తెచ్చామని ప్రభుత్వం తమ అఫిడవిట్‌లో వివరించింది. 

వెబ్దునియా పై చదవండి