ప్రియ దర్శి, నా కెమిస్ట్రీని చాలా ఇష్టపడుతున్నారు : నభా నటేష్

డీవీ

శుక్రవారం, 19 జులై 2024 (18:53 IST)
Darshi Nabha
డార్లింగ్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఎక్కువమంది ఫ్యామిలీ ఆడియన్స్, అమ్మాయిలు సినిమాని, దర్శి, నా కెమిస్ట్రీని చాలా ఇష్టపడుతున్నారు. జనాలు చాలా నచ్చుతుంది. ఆడియన్స్ రెస్పాన్స్ చాలా బావుంది. ప్రిమియర్స్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సెకండ్ హాఫ్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ కి క్లాప్స్ పడటం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆడియన్స్ సపోర్ట్ ఇలానే వుండాలని కోరుకుంటున్నాను అని హీరోయిన్ నభా నటేష్ అన్నారు
 
 హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. సినిమా చూసిన మా అమ్మగారు క్లాప్స్ కొట్టడం చాలా ఆనందంగా అనిపించింది. మనఇంట్లోనే మనం చేసిన వర్క్ కి ఆలాంటి అప్రిషియేషన్ వస్తే ఆ సంతోషం వేరుంటుంది. విమెన్ ఆడియన్స్ చాలా కనెక్ట్ అయ్యారు. సినిమా చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యారు. అందరి నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. రానున్న రోజుల్లో ఫ్యామిలీ ఆడియన్స్ అంతా థియేటర్స్ కి డార్లింగ్ చూడాలని కోరుకుంటున్నానని అన్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు