'అక్కినేని నాగేశ్వరరావుగారికి, నాకు యాభై సంవత్సరాల పరిచయం. ఆయనతో ఎన్నో హిట్ చిత్రాలు తీశాను. అవన్నీ ప్రేమ కథా చిత్రాలే. నాగేశ్వరరావు ప్రేమకథా చిత్రాల వారసత్వాన్ని నాగార్జున కొనసాగించాడు. దానిని చైతన్య, అఖిల్ పునరావృతం చేస్తున్నారు. నాగేశ్వరరావు గారి ఆశీస్సులతో ‘ప్రేమమ్’ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను’ అని దాసరి నారాయణరావు అన్నారు. చైతూ, సమంతాల ప్రేమను దృష్టిలో పెట్టుకుని దాసరి చేసిన ఆ వ్యాఖ్యకు అభిమానులు క్లాప్స్ కొట్టేశారు.