దాసరి కుమారుడి అదృశ్యం.. ఏమయ్యాడు.. ఎక్కడున్నాడు?

గురువారం, 13 జూన్ 2019 (16:39 IST)
దర్శకరత్న దాసరి నారాయణ రావు ఇండ‌స్ట్రీలో ఎన్నో స‌మ‌స్య‌లు తీర్చారు కానీ ఇంట్లో స‌మ‌స్య‌లు మాత్రం తీర్చ‌లేక‌పోయారు. మొన్నటికి మొన్న దాస‌రి పెద్ద కోడ‌లు బ‌య‌టికి వ‌చ్చి త‌న ఆస్తి కొట్టేసారంటూ మోహ‌న్ బాబుపై ఆరోప‌ణ‌లు చేసింది. తాజాగా దాసరి కుమారుడు ప్ర‌భు క‌నిపించ‌డం లేద‌ని ఫిర్యాదు న‌మోదైంది. నాలుగు రోజుల పాటు ఆయన కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. 
 
జూన్ 9వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ళ్లీ తిరిగి రాలేదు. దాంతో ప్ర‌భు కుటుంబ స‌భ్యులు జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో మిస్సింగ్ కేస్ ఫిర్యాదు చేశారు. ప‌దేళ్ల కింద కూడా ఒక‌సారి ప్ర‌భు ఇలాగే మిస్ అయిపోయాడు. అప్పుడు కూడా 2008లో కొన్ని రోజులు క‌నిపించ‌కుండా పోయి.. త‌ర్వాత వ‌చ్చి త‌న భార్య సుశీలే కిడ్నాప్‌ చేయించిందని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు. ప్రస్తుతం ఇదే తరహాలో ప్ర‌భు కనిపించకపోవడం చర్చనీయాంశమైంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు