బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మ- టీమిండియా కెప్టెన్ కోహ్లీ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో గత కొంతకాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగిన బాలీవుడ్ సెలబ్రిటీల జంట దీపికా పదుకునే, రణ్‌వీర్ సింగ్ వివాహానికి రంగం సిద్ధమైంది. వీరిద్దరికి నవంబర్ 10వ తేదీన వివాహం జరుగనుందని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
ఈ విషయంలో దీపికా పదుకునే ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. చేతిలో వున్న సినిమాలను సాధ్యమైనంత వరకు త్వరగా పూర్తి చేసి.. వివాహానికి సిద్ధం కావాలని దీపిక, రణవీర్ సింగ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్ వంటి చారిత్రాత్మక చిత్రాల్లో కలిసి నటించిన సంగతి తెలిసిందే.