అతిలోక సుందరి శ్రీదేవి మృతి ఆమె కుటుంబ సభ్యులకు తీరని లోటును మిగిల్చింది. ఫ్యాన్స్‌కు శ్రీదేవి మృతి షాకిచ్చింది. దుబాయ్‌లో ఆమె మరణించడాన్ని ఆమె కుమార్తె జాన్వి, ఖుషీ కపూర్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ధర్మ మూవీస్ బ్యానర్‌పై శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, ఇషాన్ హీరోగా రూపొందుతోన్న 'ధడక్' సినిమా ట్రైలర్ సోమవారం విడుదలైంది.
ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమానికి అనిల్ కపూర్, బోనీకపూర్‌లతో పాటు శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా హాజరైంది. ఈ కార్యక్రమంలో శ్రీదేవిని తలుచుకుని కపూర్ కుటుంబ సభ్యులంతా భావోద్వేగానికి గురయ్యారు.