బన్నీ సరసన ధోనీ హీరోయిన్.. వంశీ డైరక్షన్.. "నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా"

మంగళవారం, 7 మార్చి 2017 (11:08 IST)
బన్నీ సరసన కైరా అద్వానీ నటించనుంది. ఈమె ఎమ్ఎస్ ధోనీ సినిమా ద్వారా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. రచయిత వక్కంత వంశీ దర్శకత్వంలో అల్లుఅర్జున్ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా కూడా ఏప్రిల్ 8వ తేదీ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి  'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' అనే పేరు పరిశీలన వుంది. స్టోరీ అంతా ఫైనల్ కావడంతో నటీనటుల ఎంపిక జరుగుతోంది.
 
ఈ ప్రాజెక్ట్‌ని లగడపాటి శ్రీధర్‌ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో కైరా అద్వానీని తీసుకోవాలని చర్చ సాగుతోంది. కైరా చేతిలో ఓ ప్రాజెక్టు మాత్రమే వుంది. ఒకవేళ ఆమెకు కుదరకపోతే.. మరో హీరోయిన్‌ను తీసుకునే దిశగా సినీ యూనిట్ భావిస్తోంది. ప్రస్తుతం బన్నీ దువ్వాడ జగన్నాథమ్ చిత్రంతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది. ఆపై వక్కంత సినిమా షూటింగ్‌లో అల్లు అర్జున్ పాల్గొంటాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. 

వెబ్దునియా పై చదవండి