అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ మార్కెటింగ్‌లో దిట్ట. ఆపరంగా ఆలోచిస్తూ సినిమాలకు ఓవర్‌సీస్ మార్కెట్ చేస్తుంటాడు. ఎక్కువకాలం అమెరికాలో వుండడంతో ఆయనకు ఆ కోణాలుబాగా తెలుసు. కానీ తొలిసారిగా నిర్మాతగా మారి నాగబాబు కొడుకు వరుణ్‌తేజ్‌తో గని సినిమా తీశాడు. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం చేశారు. కానీ మొదటినుంచి ఈ సినిమాపై అనుమానాలు ట్రేడ్ వర్గాల్లో నెలకొన్నాయి. కరోనా వల్ల ఆగిపోవడంతోపాటు మధ్యలో సినిమానే ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి. మొత్తానికి సినిమాను బయటకు తెచ్చారు. బాక్సింగ్ నేపథ్యం కనుక పాత సినిమాల కంపేర్ వుంటుంది. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయిలో బాక్సింగ్ నేర్చుకుని కష్టపడి తండ్రి కోరికా నెరవేరుస్తాడు. అది బాగా కనెక్ట్ అయింది. రవితేజ, ప్రకాష్ రాజ్ పాత్రలు, చెల్లెలి సెంటిమెంట్ కూడా వర్కవుట్ అయింది.
కానీ గని విషయంలో అంతకంటే ఎక్కవ అని గనిపై పూర్తి నమ్మకం వుందని అల్లు అరవింద్ తెలిపిదే, అల్లు అర్జున్ కూడా నా ప్రతి సినిమా కథ వెనక అన్నయ్య ఉన్నాడు. అతడికి 20 ఏళ్ల అనుభవం ఉంది. అసలు చాలా మంది హీరోలకు కథలు అంచనావేయడం తెలీదు అని ప్రీరిలీజ్‌లో మాట్లాడాడు. అది ఇప్పుడు వరుణ్‌తేజ్‌కు ఆ మాటలు తగులుతున్నాయనిపిస్తుంది. విడుదలయిన రోజే చిత్ర యూనిట్ సక్సెస్ అంటూ కేక్‌లు కట్ చేసుకున్నారు. కానీ రెండు రోజుల తర్వాత ఆ సినిమాపై కలెక్షన్ల ప్రభావం దారుణంగా పడింది. జడ్జిమెంట్ తప్పు అని చాలామంది నిర్మాత, దర్శకులు, హీరోలుకూడా అనుభవపూర్వకంగా కొన్ని సార్లు తెలుసుకున్న సందర్భాలున్నాయి.
అయితే, ఈ గనిలో సామాన్యుడు కనెక్ట్ అయ్యే అంశం లేదు. పోనీ.. నేషనల్ ఛాంపియన్ పోటీలో డ్రెగ్ తీసుకున్నాడనే తన తండ్రి అపవాదు మినహా తండ్రి చనిపోయినట్లు ఎక్కడా చెప్పలేదు. క్లయిమాక్స్‌లో తన తండ్రి చనిపోయాడని తెలుసుకుంటాడు హీరో. అలాగే నేషనల్ గేమ్స్‌లో కొంతమంది ప్లేయర్స్ డ్రెగ్ తీసుకుని పతకాలు సాధించారనే వార్తలు చాలా వచ్చాయి. కొన్నిసార్లు అవి తప్పు అని రిపోర్ట్ సూచించినట్లు కూడా వచ్చాయి. ఈ కోణాన్ని దర్శకుడు బాగా హైలట్ చేస్తే బాగుండేది. ఏదైనా నిజ సంఘటన ఆధారంగానో అంటూ మన దేశంలో క్రీడా విభాగంలో ఇలాంటి రాజకీయాలు వున్నాయని ఇంకా హైలైట్ చేయాల్సింది. మరోవైపు.. డ్రెగ్ అపవాదు తన భర్త పై పడడంతో తల్లి వెంటనే కొడుకుని తీసుకుని వైజాగ్ వచ్చేస్తుంది. ఇంకో షాట్‌లో సునీల్ శెట్టిని చూపిస్తూ, ఛీటింగ్ షాట్ వేస్తారు. ఇతనే హీరో తండ్రి అనేట్లుగా. వైజాగ్ వచ్చాక.. చాలా రిచ్‌గా బతికేస్తుంటారు హీరో ఫ్యామిలీ. దాంతో కామన్ మెన్ కనెక్ట్ కాలేకపోయాడు. హీరో స్ట్రగుల్ ఎక్కడా కనిపించలేదు. పైగా హీరో ట్రైనింగ్ గురువుగా సీనియర్ నరేశ్‌ను చూపించి సిల్లీగా మార్చేశాడు.