మరోవైపు ప్రదీప్‌కు కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది తెలిసింది. తను కొద్దిరోజులుగా క్వారంటైన్‌లో వుంటున్నట్లు సన్నిహితులు తెలియజేస్తున్నారు. ఈ విషయమై ఆయన ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే టీవీలో పలు షోలలో ఆయన యాంకర్‌గా వున్నటువంటివి ముందుగానే చేసిన కనుక తాజాగా ఇటీవలే చేసిన 'డ్రామా జూనియర్స్ సీజన్ 5' ప్రోమోలో ప్రదీప్ కన్పించలేదు.
ఆయన స్థానంలో యాంకర్ రవి కనిపించడంతో ఈ వార్తకు బలం చేకూరినట్టయ్యింది. కాగా 2020 నుంచి పలువురు బుల్లితెర ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. నవ్య స్వామి, రవికృష్ణ, ప్రభాకర్, సాక్షి శివ, భరద్వాజ్, మాళవిక, సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ తదితరులు కరోనా సోకినవారి జాబితాలో ఉన్నారు.
ఇక ప్రదీప్ తను చేసిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా! సినిమాలో హీరోగా నటించాడు. ఆ సినిమా చిత్రీకరణలో ఓ యాక్షన్ సన్నివేశం చేస్తుండగా చెట్టుపైనుంచి దూకడంతో ఎడమకాలు ఫ్రాక్చర్ అయింది. ఆ సమయంలో కొద్దికాలం విశ్రాంతి తీసుకున్నాడు. ఇప్పటికీ ఆ పెయిన్ తాలూకు గుర్తులు కనిపిస్తాయి. ఏది ఏమైనా ప్రదీప్ కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.