మనిషి ఎప్పుడూ ఒకేలా వుండడు. మారుతూ వుంటారు. అందుకు పరిస్థితులు కానీ, వైవాహిక జీవితంలో ప్రవేశించినవారు కానీ మనసును మార్చితేనే కిక్ వుంటుంది. ఎప్పుడూ సినిమాలు, షూటింగ్‌లు, ఎగ్జిబిటర్‌గా లెక్కలు వేసుకోవడం, పంపిణీదారుడిగా ఏఏ సినిమాలు కొనాలి.. ఎంత లాభాలు వస్తాయి అనే వాటిపై ఎక్కువగా శ్రద్ద పెట్టిన దిల్‌రాజు.. ఇప్పుడు జీవితంలో ఏదో చేయాలనే ఆలోచనలో పడ్డాడు.
ఇదంతా తన జీవితంలో రెండో భార్య ప్రవేశించాక జరగడం విశేషమని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇంకోవైపు... బాలీవుడ్‌లో సోనూసూద్ సేవా కార్యక్రమాలు కూడా ఓరకంగా ఆయన్ను ప్రేరేపించాయని చెప్పవచ్చు. విశేషం ఏమంటే.. ఎప్పుడూ మీడియాకూ దూరంగా వుండే దిల్‌రాజు.. తన 50వ పుట్టినరోజు వేడుకను వారి సమక్షంలో జరుపుకోవడం విశేషం.
ఈనెల 18న తేదీ ఆయన పుట్టినరోజు. అందుకే లెక్కప్రకారం అంటే.. ఓవర్‌సీస్ ప్రకారం.. 17వ తేదీ రాత్రి 7.30 నిముషాలకు.. అక్కడ 18వ తేదీ వస్తుంది కాబట్టి... హైదరాబాద్‌లో ఆ టైంలో అందరితో సరదాగా గడుపుతూ కేక్ కట్ చేస్తూ తన రెండో ఇన్నింగ్సు ఎలా వుంటాయో తెలియజేశాడు. ఆయన మాటల్లోనే విందాం.
మేరేజ్ నాకు సెకండ్ లైఫ్.. మా కుటుంబంతో కలిసి మీ వద్దకు వద్దామనుకున్నాం. కానీ సాధ్యపడలేదు. ఇంటిలో చిన్న ఫంక్షన్ వుంది. అందుకే రాలేకపోయాం. నేను మిమ్మల్నిని కలుద్దామని అనుకున్నా. జీవితంలో ఇప్పటివరకూ కొన్ని సాధించాం. ఇంకా ఏదో చేయాలనే తపన వుంది. ప్రతి ఒక్కరూ ఒక స్థాయి వచ్చాక మన కోసం బతుకు, సంపాదన చేశాక.. ఏదో వెలితిగా వుంటుంది.
తర్వాత ఏమిటి? అనేది తొలుస్తుంది. అందుకే అలా ఆలోచించగా సామాజిక సేవ చేయాలని తట్టింది. ముఖ్యంగా మంచి పని చేయాలంటే మీడియా సపోర్ట్ కావాలి. ఎందుకంటే.. దిల్‌రాజు సేవ చేస్తాడంటే ఎవరెవరో వస్తారు. అందులో నిజాయితీగా ఎవరికి అవసరం అనేది తెలీదు. అందుకే మీడియా సాయం కావాలి.
వచ్చిన వారిలో ఏది కరెక్ట్ అనేది నేనొక్కడే చెప్పలేను. అందుకే నాకొక టీమ్ కావాలి. అందులో మీడియా కూడా బాగుంటుంది. మీ వద్దకు జన్యూన్ సమస్యలుంటే మా దగ్గరకు వచ్చి తీసుకురండి.. మీలో ఎవరైనా పర్సనల్‌గా సోషల్ సర్వెస్ వున్నవారు మాతో జాయిన్ అయితే బాగుంటుంది.
ముఖ్యంగా ఎడ్యుకేషన్, ఆరోగ్యం గురించి సేవ చేయాలనే అనుకున్నాను. చదవాలనుకుని ఆర్థికంగా చేయూత లేనివారు, అనారోగ్యంతో బాధపడుతూ.. వైద్యం చేయించుకోనివారి కోసమే ఈ సేవ మొదలు పెట్టాను. అలాగే మీడియాలోనూ అందరూ ఒక రీతిలో వుండరు. వారుకూడా ఇందులో పాల్గొనవచ్చు. ఎవరికైనా అవసరం వుంటే మమ్మల్ని సంప్రదించండి అంటూ చెప్పారు.
సో.. బడా నిర్మాత సేవ వైపు వెళ్ళాడు. అంటే సినిమాలు కూడా వరసుగానే వుంటాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో "వకీల్ సాబ్" రన్నింగ్‌లో వుంది. నిన్ననే.. తన పుట్టినరోజు సందర్భంగా 'ఎఫ్3' సినిమా కూడా మొదలు పెట్టాడు. ఇంకాలు పలు చిత్రాలు లైన్‌లో వున్నాయి.