తాజాగా మహిళలను ఉద్దేశించి డింపుల్ హయాతి ఓ కామెంట్ చేసింది. సినీమా, సమాజం రెండిటిని మిళితం చేస్తూ ఆమె చేసిన కామెంట్ ఆలోచించేలా వుంది. సమాజంలోనూ, సినీమాలోనూ ఎక్కడైనా మహిళ చుట్టూనే విషయాలు తిరుగుతుంటాయి. సమాజంలో మహిళ పాత్ర ఎలా వుంటుందో సినీమాలోనూ అలానే వుంటుంది. సినీమాలో కాస్త సహజంకోసం అతి అయినట్లుగా చూపించినా బయట ఇలానే వుంటారుకదా అనిపిస్తుంది. అయితే ఈ విషయంలో దర్శకుల శైలి మరింత మారాలి. పురుషుల చుట్టూనే కథ తిరగడం, మహిళ పాత్ర పరిమితం కాకుండా వుంటే బాగుంటుందని సూచించింది. మరి ఆమె మాట అమలు చేస్తారా, చూడాలి.