దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పెళ్లిసందడి టైటిల్‌తో సినిమా చేయనున్నట్టు ఇటీవల ప్రకటించారు. ఓం నమో వెంకటేశాయ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకుని రాఘేవేంద్రరావు చేస్తున్న సినిమా కావడంతో అందరిలో ఆసక్తి ఏర్పడింది. హీరో ఎవరు అనేది ప్రకటించలేదు. అయితే.. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించనున్నట్టు వార్తలు వచ్చాయి.
మరి... డైరెక్షన్ ఎవరు చేయనున్నారంటే... గౌరీ రోనకి అప్పగించారు. ఇది యూత్‌ఫుల్ సినిమా. అందులోనూ ప్రేమ, పెళ్లి కథ. అందుకే.. ఈ సినిమాకి దర్శకత్వం వహించే బాధ్యత యువతరానికే అప్పగించాలని డిసైడ్ అయ్యారని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. దీనికి స్వరవాణి కీరవాణి సంగీతం అందించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు సమాచారం.