హీరోయిన్లు నిజంగానే అందగత్తెలు : కృష్ణవంశీ

సోమవారం, 21 నవంబరు 2022 (08:33 IST)
తెలుగు చిత్రపరిశ్రమలోని స్టార్ దర్శకుల్లో కృష్ణవంశీ ఒకరు. ఆయన పేరు వినగానే ఠక్కున గుర్తుకు వచ్చే సినిమాల్లో గులాబీ, నిన్నే పెళ్లాడతా, సింధూరం, అంతఃపురం, ఖడ్గం వంటి సినమాలు గుర్తుకు వస్తాయి. ఆ సినిమాలన్నీ ఒకదానికి మించి ఒకటి భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. అలాంటి గొప్ప చిత్రాలను తెరకెక్కించిన కృష్ణవంశీ గత కొంతకాలంగా సరైన హిట్ కోసం పరితపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తన మనసులోని భావాలను వెల్లడించారు.
 
తాను హీరోయిన్లపై పెద్దగా దృష్టిపెట్టనని చెప్పారు. దీనికి కారణం.. నిజంగానే వారు మంచి అందగత్తెలు. అందువల్ల నేను ప్రత్యేక దృష్టిపెట్టి అందంగా చూపించినదేం లేదు. నిజంగానే వాళ్లు అందగత్తెలు. కెమెరా‌మెన్స్ తమదైన శైలిలో వాళ్లను చూపించారంతే. పైగా, నేను వరుస సిక్స్‌లతో పాటు వరుస డకౌట్స్‌ కూడా చూశాను అని చమత్కరించారు. 
 
పైగా, తన కెరీర్‌లో ఏది బెస్ట్ అని అంటే నేను చెప్పలేను. కెరియర్ ఆరంభంలో హిట్ వస్తే గర్వంగా ఉండేది. ఆ తర్వాత మనదేమీ లేదు అనే విషయం అర్థమైంది. ఇంకొంతకాలం పోయిన తర్వాత ఆ సమయానికి అలా జరిగింది అంతే అనిపించింది. దివంగత బాపుగారు ఓ లెజండరీ డైరెక్టర్. ఆయనతో పోలికను నేను తీసుకోలేను అని అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు