మణిరత్నం భారీ బడ్జెట్ మూవీ : నార్త్ అండ్ సౌత్ స్టార్స్‌తో ప్లాన్

శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (16:34 IST)
భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు మణిరత్నం. ఎన్నో మేలిమి ముత్యాల్లాంటి చిత్రాలను ఆయన నిర్మించారు. ఆయన నటించిన అనేక చిత్రాలు అంతర్జాతీయంగా కూడా మంచి ఆదరణ పొందాయి. ఈ క్రమంలో గత కొంతకాలంగా ఆయన ఫేడౌట్ అయ్యారు. ఇటీవలి కాలంలో ఆయన తీసిన అనేక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయంపాలయ్యాయి.
 
ఈ క్రమంలో భారీ బ‌డ్జెట్‌తో హిస్టారిక‌ల్‌ చిత్రాన్ని తెర‌కెక్కించే ప్లాన్ చేశాడు. దాదాపు రూ.800 కోట్ల బ‌డ్జెట్‌తో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందించ‌నున్న‌ట్టు స‌మాచారం. క‌ల్కి రాసిన "పొన్నియ‌న్ సెల్వ‌న్" అనే చారిత్ర‌క న‌వ‌ల ఆధారంగా తెర‌కెక్క‌నున్న ఈ సినిమా ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఏడాది చివ‌ర‌లో చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. 
 
తాజాగా చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఏఆర్ రెహ‌మాన్ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా, మొత్తం 12 పాట‌ల‌ని ఆయ‌న రూపొందిస్తున్నార‌ట‌. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తూ క్లాసిక్ స్టైల్‌లో ట్యూన్స్ సిద్దం చేస్తున్న‌ట్టు టాక్. 
 
ఇక న‌టీనటుల విష‌యానికి వ‌స్తే ఇటు సౌత్‌, అటు నార్త్‌కి సంబంధించిన ప‌లువురు స్టార్స్ ఇందులో భాగం కానున్నార‌ని చెబుతున్నారు. మద్రాస్ టాకీస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చారిత్రాత్మ‌క చిత్రంలో జయం రవి, విక్రమ్, అనుష్క, కీర్తి సురేష్, విజయ్ సేతుపతి, మోహ‌న్ బాబు, ఐశ్వ‌ర్య‌రాయ్, అమితాబ్ బ‌చ్చ‌న్ వంటి ప‌లువురు అగ్రశ్రేణి నటీనటులు నటించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు