అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం అంటూ నాగ చైతన్య తాజా చిత్రంలోని డైలాగ్ ఏ క్షణంలో బయటికి వచ్చిందో కానీ అది ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది. తాజాగా టాలీవుడ్‌లో సీనియర్ మోస్ట్ నటుడు చలపతిరావు నాగచైతన్య హీరోగా వస్తోన్న 'రారండోయ్ వేడుక చూద్దాం' ఆడియో ఫంక్షన్ సందర్భంగా యాంకర్ ఇదే ప్రశ్న సందిస్తూ అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా సర్ మీ అభిప్రాయం ఏమిటి అని మైక్ ముందు పెట్టినప్పుడు నువ్వు అలా అడిగితే నేనేం చెప్పాలి నాయనా అంటూనే మైక్ అందుకుని అమ్మాయిలు హానికరం కాదు కానీ పక్కలోకి పనికొస్తారు అంటూ ఘోరమైన కామెంట్ చేశారు.
నాగచైతన్య సరసన 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ఈ ప్రశ్నకు మరో విధంగా జవాబు చెప్పింది. అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం.. అని అంటున్నారుగా.. ఈ మధ్యనే నేను కొత్తగా ఒకటి ఆలోచించాను. అబ్బాయిలు విషపూరితం. అమ్మాయిల వల్ల హాని మాత్రమే. కానీ అబ్బాయిల వల్ల ప్రాణనష్టమే జరుగుతుంది. నేనన్న మాటలు విన్నవాళ్లందరూ ‘భలే చెప్పారే’ అని అంటున్నారు అని రకుల్ ఫిట్టింగ్ రిప్లై ఇచ్చేసింది.