ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, మా టీమ్ సమిష్టి కృషి. శివుడు భక్తుడిగా నేను చేసిన అఖండలోని పాత్ర నాన్నగారు చేసిన పాత్రలు గుర్తుచేసుంటూ వాటిని పోషించాను. మొన్ననే సంక్రాంతి పండుగ జరుపుకున్నాం. ఇప్పుడు అఖండ పండుగ ఇది. కోవిడ్ సమయంలో థియేటర్లకు ప్రేక్షకులు వస్తారోరారో అనుకున్న సమయంలో తీర్థయాత్రలకు వచ్చినట్లు థియేటర్లకు జనాలు వచ్చారు. ఇది ఆంధ్ర, తెలంగాణేకాదు, కర్నాటక, మహారాష్ట్ర, ఒరిస్సా అలాగే యావత్ ప్రపంచ పండుగ అఖండ అర్థ శతదినోత్సవం. ఈ వేడుకను పలుచోట్ల అభిమానులు జరుపుకుంటున్నారు. అందుకు గర్వంగా వుంది. ఈ సినిమా విజయాన్ని చేసేలా సహకరించిన ఆది దంపతులకు కృతజ్ఞతలు. ఇక బోయపాటి శ్రీను, నా కాంబినేషన్ హాట్రిక్. మా కలయిక జన్మజన్మలది. అందుకే ఆ దేవుడే మమ్మల్ని కలిపాడు. అన్నారు. వెంటనే అభిమానులు కోలాహలంగా జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు.
ఇక వారి అభిమానం గురించి కూడా ఇలా మాట్లాడారు.
మానవ పుట్టుకలో ఒకరో ఇద్దిరినో స్నేహితులుగా ఇస్తారు. కానీ మాకు కోట్లాది మంది అభిమానులను సంపాదించేలా భగవంతుడు చేశాడు. నేను ఏది చేసినా అభిమానులు ప్రోత్సహిస్తూనే వున్నారు. నాకు నాన్నగారు ఆదర్శం. ఈఅఖండ విజయం తెలుగు చలన చిత్ర పరిశ్రమ విజయం అని తెలిపారు.