పద్మావత్ అశ్లీల సినిమా.. అస్సలు చూడొద్దు.. ఓవైసీ అసదుద్ధీన్

శుక్రవారం, 19 జనవరి 2018 (13:35 IST)
పద్మావతి సినిమా 'పద్మావత్‌'గా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దీపికా ప‌దుకొణే, షాహిద్ క‌పూర్‌, ర‌ణ్‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన చిత్రం ప‌ద్మావ‌త్‌ సినిమా జ‌న‌వ‌రి 25న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా తెలుగు వెర్షన్ సంబంధించి ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ తెలుగు అభిమానులని ఎంతగానో అలరిస్తుంది. 
 
ఈ సినిమాపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా ఒక కట్టు కథ అన్నారు. అంతటితో ఆగకుండా ముస్లింలు ఎవ్వరూ పద్మావత్‌ను చూడవద్దన్నారు. ఈ సినిమా కోసం డబ్బు, సమయాన్ని అస్సలు వృధా చేసుకోవద్దునని ఓవైసీ సూచించారు. పద్మావత్ లాంటి అశ్లీల సినిమాలు చూడవవద్దన్నారు. 1540 నాటి చరిత్ర అంటూ ముస్లిం కవి మల్లిక్ మహ్మద్ రాసిన ఫిక్షన్ కథే ఇదన్నారు
 
ఈ సినిమాను అడ్డుకునేందుకు ప్రధాని మోదీ 12 మంది సభ్యులతో కమిటీని నియమించారని ఓవైసీ చెప్పుకొచ్చారు. ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడిన వీహెచ్పీ నేత ప్రవీణ్ తొగాడియాకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటిస్తూ, ద్వంద్వ వైఖరిని అవలంభిస్తోందని ఆరోపించారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు