టాలీవుడ్ కింగ్ నాగార్జున - సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ఆఫీసర్. ఈ సినిమా టీజర్‌ను ఇటీవల రిలీజ్ చేసారు. అయితే... ఈ టీజర్‌కి ఊహించినంతగా రెస్పాన్స్ రాలేదు. దీనికితోడు ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే వర్మ జిఎస్టీ అంటూ వివాదస్పదమైన షార్ట్ ఫిల్మ్ తీయడంతో నాగ్‌తో తీస్తోన్న సినిమాపై దృష్టి పెట్టడం లేదు అంటూ విమర్శలు వచ్చాయి.
ఇదిలాఉంటే... ఇటీవల వర్మ పవన్‌ని శ్రీరెడ్డితో తిట్టించడంతో ఎంతటి వివాదస్పదం అయ్యిందో తెలిసిందే. వర్మని బహిష్కరించాలి అని డిమాండ్ వచ్చిందంటే... వర్మపై కోపం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆఫీసర్ సినిమా రిలీజ్ దగ్గర పడుతోన్న ఈ టైమ్‌లో వర్మ ఇలా వివాదంలో ఇరుక్కోవడంతో నాగ్ బాగా ఫీలయ్యాడట. వర్మకి బాగా క్లాస్ తీసుకున్నాడని టాక్ వినిపిస్తోంది.
అయితే... ఆఫీసర్ మూవీపై క్రేజ్ తెచ్చేందుకు నాగ్ సెకండ్ టీజర్ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. నాగ్ ఫ్యాన్స్ మాత్రం అసలు వర్మకి ఈ టైమ్‌లో నాగ్ అవకాశం ఇవ్వడమే పెద్ద తప్పు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా ఇప్పుడు ఏం చేసినా.. ఆఫీసర్ ఆకట్టుకోవడం కష్టమే అంటున్నారు. మరి... ప్రచారంలో ఉన్నది నిజం కానుందా..? లేక అందరి అంచనాలను తలకిందలు చేస్తూ ఘన విజయం సాధిస్తాడా అనేది తెలియాలంటే ఈ నెల 25 వరకు ఆగాల్సిందే.