వరుస సినిమాలు సిద్ధమవుతున్న డ్రింకర్ సాయి ఫేమ్ హీరో ధర్మ

దేవీ

గురువారం, 8 మే 2025 (16:07 IST)
Hero Dharma
“డ్రింకర్ సాయి” సినిమాలో నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు టాలెంటెడ్ హీరో ధర్మ. అందరి ప్రశంసలతో పాటు పలు అవార్డ్స్ కూడా దక్కించుకున్నారు. ఇప్పుడీ యంగ్ హీరో క్రేజీ ప్రాజెక్ట్స్ లైనప్ చేసుకుంటున్నారు. నటుడిగా తనను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసేలా ఆ మూవీస్ ఉండబోతున్నాయి. వీటికి సంబంధించిన అనౌన్స్ మెంట్ త్వరలో చేయబోతున్నారు హీరో ధర్మ.
 
గతేడాది థియేటర్స్ లోకి వచ్చిన “డ్రింకర్ సాయి” సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకుని మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో హీరో ధర్మ తన డ్యాన్సులు, ఫైట్స్, యాక్టింగ్ తో అందరినీ మెప్పించాడు. సాయి పాత్రలో ధర్మ చేసిన పర్ ఫార్మెన్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. టీజింగ్, ఫన్, ఎమోషనల్ సీన్స్ లో మెచ్యూర్డ్ యాక్టింగ్ చేశాడు ధర్మ. తన నెక్ట్స్ మూవీస్ ను మరింత పర్పెక్ట్ గా ప్లాన్ చేస్తున్నాడీ యంగ్ హీరో. ఈ క్రమంలో ఇన్నోవేటివ్ స్క్రిప్ట్స్ లో నటించేందుకు, యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ తో పనిచేసేందుకు హీరో ధర్మ ఆసక్తిగా ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు