డ్రగ్స్ కేసు... పూరీ-కెల్విన్-ఓ జ్యోతిలక్ష్మీ, అడ్డంగా బుక్కయిపోయినట్లే...

బుధవారం, 19 జులై 2017 (18:44 IST)
డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరీ జగన్నాథ్ పీకల్లోతు కూరుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ ఉదయం సిట్ ముందు విచారణకు హాజరైన పూరీని అధికారులు విచారిస్తూనే వున్నారు. తన వ్యక్తిగత జీవితం దగ్గర్నుంచి మొదలుకుని సినిమా జీవితం వరకూ అన్ని విషయాలపై వారు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ విషయానికి వచ్చేసరికి పూరీ తనకు కెల్విన్ అనే వ్యక్తి ఎవరో తెలియదని సమాధానాన్ని దాటవేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. 
 
దీనితో వారు చార్మి కథానాయికగా తెరకెక్కిన జ్యోతిలక్ష్మి చిత్రం ఆడియో వేడుకలో పాల్గొన్న కెల్విన్ ఫోటోలను బయటపెట్టడంతో నిజాన్ని అంగీకరించక తప్పని పరిస్థితి ఎదురైంది. ఇంకా అనేక రకాలుగా సిట్ అధికారులు ప్రశ్నిస్తుండటంతోపాటు డ్రగ్స్ తను ఆరు నెలల క్రితమే మానేసినట్లు పూరీ చెప్పడంతో అతడి రక్త నమూనాలను సేకరించి విషయాన్ని నిర్థారించేందుకు నార్కోటిక్ నిపుణులను రంగంలోకి దింపారు అధికారులు. మొత్తమ్మీద చూస్తే పూరీ జగన్నాథ్ డ్రగ్స్ కేసులో బాగా ఇరుక్కుపోయినట్లుగా అనిపిస్తోంది.

వెబ్దునియా పై చదవండి