ఆ సినిమా పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నా: దుల్కర్ సల్మాన్ - మ్యాడ్ లా ఉంటుంది: శ్రీలీల

గురువారం, 5 అక్టోబరు 2023 (09:02 IST)
Dulquer Salmaan, Srileela,sidhu jonnalagadda
"రీసెంట్ గా గుంటూరు కారం షూటింగ్ లొకేషన్ లో నేను అటుఇటు నడుస్తుండగా నిర్మాతలు మ్యాడ్ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఈ సినిమా గురించి తెలుసుకున్నాను. ఈ సినిమా ఈవెంట్ కి రావడం సంతోషంగా ఉంది. నాకు జాతిరత్నాలు చూసినప్పటి నుంచి ఇలాంటి హిలేరియస్ సినిమాలంటే చాలా ఇష్టం. నేను సితారలో ఆదికేశవ సినిమా చేస్తున్నాను. త్వరలోనే ఆ సినిమాతో అలరిస్తాం. ఈ మ్యాడ్ సినిమా మ్యాడ్ ఉంటదంట. అందరూ చూసి ఎంజాయ్ చేయండి" అని శ్రీలీల అన్నారు.
 
MAD prerelease
ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయమవుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'మ్యాడ్'. సూర్యదేవర నాగ వంశీ సమర్పిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ కి ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా అక్టోబర్ 6న థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానుంది. బుధవారం రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు దుల్కర్ సల్మాన్, సిద్ధు జొన్నలగడ్డ, శ్రీలీల, దర్శకుడు వెంకీ అట్లూరి, దర్శకుడు అనుదీప్ తదితరులు అతిథులుగా హాజరయ్యారు.
 
ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. నేను సితార బ్యానర్ లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు సినిమా చేస్తున్నాను. ఆ సినిమా పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. మ్యాడ్ విషయానికొస్తే ట్రైలర్ నిజంగానే మ్యాడ్ గా, చాలా ఫన్నీగా ఉంది. నటీనటులు ఎవరూ కొత్తవాళ్ళ లాగా లేరు. చాలా బాగా చేశారు. భీమ్స్ గారి మ్యూజిక్ చాలా బాగుంది. ఆ మ్యూజిక్ విని నాకు తెలియకుండానే కాలు కదుపుతున్నాను. షామ్ దత్ గారి వర్క్ సూపర్బ్. హారిక, చినబాబు గారు, వంశీ గారు అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా మ్యాడ్ బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశిస్తున్నాను. సిద్ధు నీ టిల్లు స్క్వేర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. శ్రీలీల ఒకేసారి చాలా సినిమాలు చేస్తుంది. నేను తన డ్యాన్స్ చూసి సర్ ప్రైజ్ అవుతాను. ఆల్ ది బెస్ట్." అన్నారు.
 
సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. "సితార సినిమా అంటే నా సినిమా లాంటిది. సితార వాళ్ళు సినిమా గురించి తప్ప ఖర్చు గురించి గానీ, టైం గురించి గానీ పట్టించుకోరు. సినిమా కరెక్ట్ గా రావాలని మాత్రమే చూస్తారు. నాగవంశీ గారు ఇప్పటికే చెప్పినట్టు జాతిరత్నాలుకి ఏమాత్రం తగ్గకుండా ఎంజాయ్ చేస్తారు.  అన్నారు.

చిత్ర దర్శకుడు కళ్యాణ్ శంకర్ మాట్లాడుతూ.. మొదట ఈ కథ ఐడియాని సిద్ధుకి చెప్పినప్పుడు.. బాగుందని చెప్పి వంశీ అన్నతో మాట్లాడించాడు. ఎడిటర్ నవీన్ నూలి అన్న సినిమాని తీర్చిదిద్దిన విధానం వేరే లెవెల్. ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చిన భీమ్స్ అన్నకి లవ్ యూ. డీఓపీలు షామ్ గారు, దినేష్ సినిమాని అందంగా తీశారు. అలాగే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి స్పెషల్ థాంక్స్. మా హీరోల గురించి సక్సెస్ మీట్ లో స్పెషల్ గా మాట్లాడతాను. నా ఫ్రెండ్ అనుదీప్ లేకపోతే నేను లేను. థాంక్యూ అనుదీప్" అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు