ఆ హీరోల వెనుక ఎద్దులను పరిగెత్తించి.. వారి ఫీలింగ్ చూడాలి : రామ్‌గోపాల్‌ వర్మ

ఆదివారం, 22 జనవరి 2017 (08:49 IST)
నచ్చినా, నచ్చకున్నా జనాగ్రహానికి భయపడో, మరే కారణం వల్లనో తమిళనాడులోని 'జల్లికట్టు'ను సపోర్ట్‌ చేస్తున్నారు కొందరు సినిమా హీరోలు, హీరోయిన్లు, ఇతర ప్రముఖులు. అలాంటి వాళ్ల మధ్య ధైర్యంగా ఆ ఆచారం గురించి ప్రశ్నించాడు 'ట్వీట్‌స్టార్‌' రామ్‌గోపాల్‌ వర్మ. 'మూగ జీవాలను హింసించడం తమిళ సాంప్రదాయమని అంగీకరించేవారు.. అమాయక ప్రజలను చంపడం ఆల్‌ఖైదా సాంప్రదాయమని ఒప్పుకుని సరిపెట్టకుంటారా?' అని ప్రశ్నించాడు. 
 
అలాగే 'జల్లికట్టు'ను సమర్థిస్తున్న సినిమా వాళ్లను కూడా రామ్‌గోపాల్‌ వర్మ కడిగిపారేశాడు. 'శశికళ, జయలలితలను పూజించే ప్రజలు జల్లికట్టును సమర్థించడం బాగానే ఉంది. విపరీతమైన వ్యక్తిపూజ, జంతు బలి ఆదిమ జాతి తెగల్లోనే ఉంటాయి.
 
సినిమాల్లో కాకులను, కుక్కలను హింసించినట్టు చూపించినా ప్రభుత్వం ఒప్పుకోదు. కానీ, సాంప్రదాయం పేరుతో ఎద్దులను హింసించడానికి పర్మిషన్‌ ఇచ్చేసింది. ఇక, సినిమావాళ్లంతా జల్లికట్టును సమర్థిస్తున్నారు. అలా సమర్థిస్తున్న వారందరి వెంటకనీసం వంద ఎద్దులను పరిగెత్తించాలి. అప్పుడు వారి ఫీలింగ్‌ ఏమిటో చెప్పమనాల'ని వర్మ ట్వీట్లు చేశాడు.

వెబ్దునియా పై చదవండి