సార్! ఇన్‌ఫర్‌మేషన్ కరెక్టే ఇక మీరు రావచ్చనే వాయిస్‌తో టీజర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడే ఆసక్తిని దర్శకుడు కలిగించాడు. రావడంతోనే సీక్రెట్ రెయిడ్ చేసిన పోలీసు ఆఫీసర్ పృథ్వి.. దీని గురించి బయటకు రాకూడదని మీడియాతో చెబుతాడు. రెయిడ్‌కు ముందు, రావచ్చనేది ఓ వాయిస్ వినిపిస్తుంది.
సార్.. మన హీరో అంటూ వాయిస్ చెప్పడంతో పవన్‌తేజ్ ఇంట్రడక్షన్ వుంటుంది. చొక్కా దులుపుతూ వెనుక నుంచి వేసుకునే విధంగా చిరంజీవి స్టయిల్‌ను పోలివుంటుంది. చేతులు, భుజాలు కదిలించే విధానం చిరునే గుర్తుచేస్తుంది. అయితే లాంగ్ షార్ట్‌లో కొణిదెల ఫ్యామిలీ ఫీచర్సు అతనిలో కన్పిస్తాయి. ఓ మహిళ ఫొటో పృథీ దగ్గరకు రావడం ఆమెను శోధించే క్రమంలో కథనం సాగుతున్నట్లుగా టీజర్‌ను చూస్తే అర్థమవుతుంది.
అనంతరం ఓ యాక్షన్ సీన్ కూడా అతనికి వుంది. కాన్ఫిడెన్స్ లెవల్‌ను టచ్ చేయకు బ్రదర్.. ఎవరెస్ట్‌కంటే ఒక అడుగు ఎక్కువే వుంటుందనే చురక వేస్తాడు హీరో. ఆ తర్వాత ఈ కథలో పాత్రలు కల్పితమే.. అనే బేక్‌డ్రాప్ టైటిల్ సాంగ్ కూడా సాగుతుంది. ముగింపులో మిస్టరీ రివీల్సు సూన్.. అనేది చూపిస్తారు.
మొత్తంగా చూస్తే ఈ టైటిల్ ఎందుకు పెట్టారనే దానితోపాటు పవన్‌తేజ్ మెగా ఫ్యామిలీకి చెందినవాడనేది ఇప్పటికే బయట పెట్టేశారు. రాంచరణ్‌కు సోదరుడు వరుస అంటున్నారు కాబట్టి.. ఎలా ఏమిటి? అనేది మిస్టరీ కూడా కొద్దిరోజుల్లో రిలీవ్ చేస్తారన్నమాట.. ఒక సస్పెన్స్ థిల్రర్‌కు వుండాల్సిన విధంగా టీజర్ వుంది.
పవన్ తేజ్ కొణిదెల హీరోగా పరిచయం చేస్తూ మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనరుపై అభిరామ్ ఎమ్.దర్శకత్వంలో రాజేష్ నాయుడు నిర్మిస్తున్న థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ 'ఈ కథలో పాత్రలు కల్పితం'. మేఘన హీరోయిన్‌గా నటిస్తుంది.
ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్‌కి, సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. గురువారంనాడు ఈ చిత్రం టీజర్ ని మెగాబ్రదర్ నాగబాబు రిలీజ్ చేసి సినిమా గ్రాండ్ సక్సెస్ కావాలని టీమ్ అందరికీ బెస్ట్ విషెస్ తెలిపారు. ప్రస్తుతం పోస్టుప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్స్ లలో విడుదల కావడానికి సన్నద్ధం అవుతోంది.
ఈ సందర్భంగా నిర్మాత రాజేష్ నాయుడు మాట్లాడుతూ, 'మా చిత్ర టీజర్ రిలీజ్ చేసిన నాగబాబుకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆడియెన్స్ థ్రిల్ ఫీలయ్యే విధంగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఎంటర్టైన్‌మెంట్ జోడించి ఈ కథలో పాత్రలు కల్పితం' చిత్రాన్ని రూపొందించాం. దర్శకుడు అభిరామ్ క్వాలిటీ తగ్గకుండా ఎంతో అద్భుతంగా ఈ సినిమాని తెరకెక్కించాడు. టైటిల్‌కి పాజిటివ్ బజ్ క్రియేట్ అవడంతో మా హీరో పవన్ తేజ్ కొణిదెలకి పర్ఫెక్ట్ లాంచింగ్ ఫిల్మ్ అవుతుంది అన్నారు.
డైరెక్టర్ అభిరామ్ ఎమ్ మాట్లాడుతూ, 'ఈ సినిమాతో పవన్ తేజ్ కొణిదెల హీరోగా మంచి పేరు తెచ్చుకుంటాడు. నిర్మాత రాజేష్ నాయుడు సినిమాను కాంప్రమైజ్ కాకుండా రిచ్‌గా నిర్మించారు. ఔట్ పుట్ చాలా బాగా వచ్చింది. తప్పకుండా ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుంది అన్నారు.