ఎంత మేథావి అయినా ఎంత విద్వత్తు వున్నా మనం రాసే పదాలు, పలికే మాటలు పామరుడు నుండి పెద్దవారి వరకు అర్థమయ్యేలా వుండాలని గీత రచయిత రామజోగయ్య శాస్త్రి అన్నారు. చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో లాహే.. లాహే.. అంటూ శివునిపై సాగే పాటలో అర్థవంతమైన సాహిత్యంతోపాటు అప్పటి తరానికి చెందిన గ్రాంథికం కూడావుంటుంది. ఇది తెలియని ఇప్పటితరం ఇలా రాస్తే ఎలా? అనే చర్చ అప్పట్లో పెట్టారు. దీనిపై రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ, ఆ పాటను అలానే రాయాలి అంటూ వివరించారు.