అయితే స్వల్పకాలంలోనే హీరోయిన్ స్థాయికి ఎదిగిపోయిన కీర్తి సురేష్.. ధనుష్, విజయ్, సూర్యలతో రొమాన్స్ చేసిన ఈ భామ చేతిలో సినిమాలు మస్తుగా ఉన్నాయ్. ఫ్యాన్స్ సంఖ్య కూడా కీర్తి సురేష్‌కి బాగా పెరిగిపోవడంతో.. ఆమెకు గుడికట్టేందుకు వారు సిద్ధమైపోతున్నారు.
అందమైన లుక్.. సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తూ.. గ్లామర్ రోల్సూ చేస్తూ ఆకట్టుకునే కీర్తి సురేష్‌కు గుడి కడితే తప్పేంటని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. కానీ గతంలో కుష్బూకు గుడి కట్టి ఆమె పెళ్ళికి ముందే సెక్స్‌పై చేసిన కామెంట్లతో.. ఆ గుడిని మట్టికరిపించిన నేపథ్యంలో కీర్తి సురేష్‌కు ప్రస్తుతం ఫ్యాన్స్ గుడి కట్టించడంతో ఎంతవరకోనని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.