జుట్టు రాలుతోందా? మెంతికూర ప్యాక్‌ను ట్రై చేయండి అంటున్నారు. మెంతిలో అధిక మోతాదులో లభించే ప్రొటీన్ జుట్టు రాలడాన్ని నివారించడంలో కీలకంగా పనిచేస్తుంది. ఇందులోని నికోటినిక్, లెసిథిన్ కుదుళ్లు బలంగా మారేందుకు, జుట్టు ఎదగడానికీ సాయం చేస్తాయి. ఇక ఇందులోని పొటాషియం చిన్నవయసులోనే శిరోజాల రంగు మారడాన్ని అరికడుతుంది. ఈ ఫలితాలు అందాలంటే గుప్పెడు మెంతుల్ని ఓ రోజంతా నానబెట్టాలి. ఆ నీటిని వడకట్టి జుట్టుని తడపండి. జుట్టుని అలాగే మూడు నాలుగు గంటలపాటు ఆరనివ్వండి. ఆపై గోరువెచ్చని నీటితో స్నానం చేసి చూడండి. ఇలా వీలైతే రోజూ చేయండి.