కరోనా వేళ సోషల్ మీడియాలో ప్రతి రోజూ ఏదో ఒకటి ట్రెండింగ్ అవుతున్నాయి. హీరోల బర్త్‌డేలు, సినిమా యానివర్సరీలు, పలు ఆసక్తిర అంశాలు సోషల్ మీడియాలో ప్రతి రోజు ట్రెండింగ్‌లో ఉంటాయి. ఈ నేపథ్యంలో జూలై 21వ తేదీ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన రొమాంటిక్ చిత్రం ఫిదా మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మూవీ మేకింగ్ సన్నివేశాలు వీడియో ద్వారా విడుదల చేశారు.
ఇక సూపర్ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనుష్క జూలై 20, 2020తో ఇండస్ట్రీలో 15 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి లేడి సూపర్‌స్టార్‌గా అభిమానులచే పిలవబడుతున్న అనుష్కకి పలువురు విషెస్ అందిస్తున్నారు.
తమిళ స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, మాధవన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'విక్రమ్ వేద'. 2017లో విడుదలైన ఈ సినిమా నేటితో మూడేళ్లు పూర్తి చేసుకుంది. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాని రీమేక్ చేసే ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.