డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న దర్శకుడు పూరీ జగన్నాథ్ విచారణ నిమిత్తం సిట్ ముందు హాజరయ్యారు. ఎక్సైజ్ అధికారులు వేస్తున్న ప్రశ్నలకు పూరీ జగన్నాథ్ స్థిరంగా సమాధానాలు ఇస్తున్నప్పటికీ కొన్ని కీలక ప్రశ్నలు వేస్తున్నప్పుడు నీళ్లు నములుతున్నట్లు సమాచారం. ఒకేవేళ తెలియదని సమాధానాన్ని దాట వేసేందుకు ప్రయత్నించినా వెంటనే వాటి తాలూకు ఫోటోలను పూరీ ముందు ఉంచుతున్నారట.
ఉదయం నుంచి ప్రారంభమైన సిట్ విచారణ ఇప్పటికీ సాగుతూనే వుంది. భోజనం తర్వాత కూడా పూరీ జగన్నాథ్‌ను విచారిస్తూనే వున్నారు. తను డ్రగ్ సరఫరా చేసే వ్యక్తిని ఎక్కడ కలిశానని చెబితే అక్కడికి ఓ టీమ్ మెరుపు వేగంతో వెళ్లి అక్కడ పూరీ జగన్నాథ్ ఎప్పుడెప్పుడు వచ్చారంటూ వాకబు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద పూరీ జగన్నాథ్ ను సిట్ లోతుగా ప్రశ్నిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు తెలుస్తోంది.