'మొయిదీన్ భాయ్ ఆట మొదలైంది...' :: 'లాల్ సలాం'లో రజనీ ఫస్ట్ లుక్ రిలీజ్

సోమవారం, 8 మే 2023 (16:21 IST)
ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్న కొత్త చిత్రం "లాల్ సలాం". విష్ణు విశాల్, విధార్థ్‌లు హీరోలుగా నటిస్తుండగా, సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్రం తాజాగా రిలీజ్ చేశారు. ఆ ఫోటోకు మొయిదీన్ భాయ్ ఆట మొదలైంది అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
 
ఈ లుక్‌ను చూస్తే ముస్లిం గెటప్‌పై రజనీకాంత్ సింహంలా నడిచివస్తున్నారు. తలైవర్ మాస్ గెటప్‌లో ఓ రేంజ్‌లో కనిపిస్తున్నారు. లైకా ప్రొడక్షన్ బ్యానరుపై నిర్మాత సుభాస్కర్ నిర్మించే ఈ చిత్రానికి ఏఆర్.రెహ్మాన్ సంగీతం సమకూర్చుతున్నారు. 
 
ఈ లుక్‌పై లైకా ప్రొడక్షన్ ప్రతినిధులు స్పందిస్తూ, లాల్ సలాం చిత్రంలో రజనీకాంత్ ఓ పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తారని తెలిపారు. ఆయన పాత్రకు సంబంధించిన లుక్‌ను విడుదల చేయడం చాలా హ్యాహీగా ఉందని చెప్పారు. ఆయన తనదైన స్టైల్‌‍లో అద్ఫుత నటనను ఈ చిత్రంలో చూస్తారని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు