పవన్ కళ్యాణ్ 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' ఫస్ట్‌లుక్‌ అదుర్స్

ఆదివారం, 16 ఆగస్టు 2015 (08:18 IST)
పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ తాజా చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేసింది. స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా శనివారం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. గబ్బర్‌సింగ్‌కు సీక్వెల్‌లా వస్తున్న ఈ చిత్రంలో పవన్‌ కళ్యాణ్‌ పోలీసు ఆఫీసర్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ ఫస్ట్‌లుక్‌ను ట్విట్టర్‌లో విడుదల చేశాక అటు ఫ్యాన్స్‌ నుంచి ఇటు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని నిర్మాత శరద్‌మరార్‌ తెలిపారు.
 
 
ఇదే అంశంపై ఆయ మాట్లాడుతూ... పవన్‌కళ్యాన్‌ ఈచిత్ర కథ, స్క్రీన్‌ప్లేపై మంచి అవగాహనతో వున్నారనీ, చిత్రంలోని ఫస్ట్‌లుక్‌ నుంచి అన్ని విషయాలను జాగ్రత్తగా చూసుకుంటున్నారని పేర్కొన్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌తోకూడిన యాక్షన్‌ చిత్రమిదని తెలిపారు. ఈ చిత్రాన్ని నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లిమిటెడ్‌, పవన్‌కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ ప్రై.లిమిటెడ్‌, ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నట్టు వివరించారు. 
 
ఈ చిత్రానికి కె.ఎస్‌. రవీంద్రనాథ్‌ (బాబీ) దర్శకత్వం వహిస్తుండగా, దేవీశ్రీప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నారు. ఇటీవలే రామ్‌లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో యాక్షన్‌ సన్నివేశాలను హైదరాబాద్‌లో చిత్రించారు. తదుపరి షెడ్యూల్‌ సెప్టెంబర్‌ మొదటివారంలో ప్రారంభంకానుంది. 

వెబ్దునియా పై చదవండి