సంక్రాంతి బరిలోకి మహేష్ కొత్త చిత్రం

శనివారం, 31 జులై 2021 (17:13 IST)
సూపర్ స్టార్ మహేష్ కొత్త చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురాం దర్శకత్వంలో వస్తున్న 'సర్కారు వారి పాట' చిత్రంలో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. 
 
అయితే, ఈ మూవీ సంక్రాంతి బరిలో రిలీజ్ అవుతుందని వెల్లడించింది. 2022 జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు ప్రకటించారు. మహేశ్ బాబు స్పందిస్తూ 'సరికొత్త యాక్షన్, ఎంటర్‌టైన్మెంట్‌తో వచ్చేస్తున్నాం... సంక్రాంతికి కలుద్దాం' అంటూ ట్వీట్ చేశారు.
 
'సూపర్ స్టార్ మహేశ్ బాబు వచ్చేశాడు... 'సర్కారు వారి పాట' నుంచి ఫస్ట్ నోటీస్ వచ్చేసింది" అంటూ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పోస్టు చేసింది. దాంతోపాటే, మహేశ్ బాబు పుట్టినరోజును పురస్కరించుకుని ఆగస్టు 9న సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ ఉంటుందని అభిమానులకు తీపి కబురు చెప్పింది. 
 
కాగా, ఈ చిత్రంలో మహేష్ బాబు సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. గత చిత్రాలకు భిన్నంగా మహేశ్ బాబు కొత్త హెయిర్ స్టయిల్‌తో ఈ చిత్రంలో కనువిందు చేయనున్నాడని తాజా పిక్ చెబుతోంది.


 

SuperStar @urstrulyMahesh has Landed in Style

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు