ఒకానొక సమయంలో 90 దశకంలో సన్నీ డియోల్ అన్న పేరు యాక్షన్ సినిమాలకు బాలివుడ్ అంతటా మార్మోగిపోయింది. తండ్రి ధర్మేంద్ర చరిష్మాను సన్నీ డియోల్ కాపాడుతూ వచ్చాడు. అలాంటి టైంలో సన్నీ నుండి వచ్చిన ఓ సూపర్ హిట్ చిత్రమే 'ఘాయల్'. రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వంలో యాక్షన్ డ్రామాగా శత్రువుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన ఓ అన్నయ్య పగని తమ్ముడు ఏ విధంగా తీర్చుకున్నాడు అన్న కథను అమోఘంగా తెర మీద ఆవిష్కరించారు.
విశేషం ఏమిటంటే.. 'ఘాయల్' చిత్రంలో కథ ఎక్కడైతే ఆగిపోయిందో మళ్ళీ అక్కడి నుండే ఈ సీక్వెల్ మొదవటం. మరీ ముఖ్యంగా సన్నీ డియోల్ దర్శకత్వం వహించగా, ధర్మేంద్ర ఈ సీక్వెల్ సినిమాని నిర్మించారు. ఘాయల్ అన్న బ్రాండ్ వచ్చి పదహారేళ్ళు అయినా క్రేజ్ చెక్కుచెదరలేదు.