గ్లోబ‌ల్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు కానుక‌గా డ‌బుల్ ధ‌మాకా

సోమవారం, 27 మార్చి 2023 (08:44 IST)
Ramcharan birthday vedukalu
గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు వేడుక‌లు ముంద‌స్తుగానే అంగ‌రంగ‌వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. ఆల్రెడీ ఆర్సీ 15 సెట్లో రోజాపూల జ‌ల్లుల్లో, మేక‌ర్స్ స‌మ‌క్షంలో, యూనిట్ అంద‌రి చ‌ప్ప‌ట్ల న‌డుమ అందంగా పుట్టిన‌రోజు సంబ‌రాల‌ను కేట్ క‌ట్ చేసి ప్రారంభించారు రామ్‌చ‌ర‌ణ్‌.  ఆ జోష్‌ని కంటిన్యూ చేస్తూ,  ఫ్యాన్స్ కి రామ్‌చ‌ర‌ణ్ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని మ‌రో రెండు స‌ర్‌ప్రైజ్ గిఫ్టుల‌ను ప్యాక్ చేస్తున్నారు మేక‌ర్స్.
 
ఆర్సీ 15 సినిమాను శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ సంస్థ ప్రతిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది. సెన్సేష‌న‌ల్‌, స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఇండియ‌న్ సినిమా గ‌ర్వించ‌ద‌గ్గ ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.
 
రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకుని అభిమానుల కోసం రెండు గిఫ్టుల‌ను ప్యాక్ చేస్తోంది ఆర్సీ 15. అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న టైటిల్ రివీల్ చేయాల‌ని ఫిక్స్ అయ్యారు మేక‌ర్స్. దీంతో పాటు డ‌బుల్ ధ‌మాకాగా ఫ‌స్ట్ లుక్‌ని కూడా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. 
 
ఉద‌యం 8.19 కి ఓ అప్‌డేట్‌, మ‌ధ్యాహ్నం 3.06కి మ‌రో అప్‌డేట్‌తో అభిమానుల‌ను ఆనందంలో ముంచెత్త‌డానికి రెడీ అవుతున్నారు మేక‌ర్స్.
 
గ్లోబ‌ల్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ స‌ర‌స‌న ఈ సినిమాలో కియారా అద్వానీ న‌టిస్తున్నారు. ఇటీవల  వీరి మీద ఓ పాట‌ను కూడా చిత్రీక‌రించారు. ఈ పాట‌కు ఇండియ‌న్ మైఖేల్ జాక్స‌న్ ప్ర‌భుదేవా మాస్ట‌ర్ నృత్య రీతుల్ని స‌మ‌కూర్చారు. ఈ పాట పూర్త‌యిన సంద‌ర్భంగానే యూనిట్ మొత్తం ఆర్సీ 15సెట్లో రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను వైభ‌వంగా జ‌రిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు