జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ ప్రస్తుతం ఉమెన్ సెంట్రిక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ క్రమంలోనే గుడ్ లక్ సఖి సినిమాతో కీర్తి సురేష్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రాబోతోన్నారు. ఇందులో ఆది పినిశెట్టి, జగపతి బాబు ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రావ్యా వర్మ సహ నిర్మాతగా ఈ చిత్రం రాబోతోంది.