ఆగ‌స్ట్ 9న ‘స‌ర్కారువారి పాట‌’ బ‌ర్త్ డే బ్లాస్ట‌ర్‌

శనివారం, 31 జులై 2021 (17:23 IST)
Mahesh look
సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న చిత్రం ‘స‌ర్కారువారి పాట‌’. భారీ అంచ‌నాల‌తో రూపొందుతోన్న ఈ సినిమాను ప‌ర‌శురాం డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ప్రేక్ష‌కులు, అభిమానులు సంతోషప‌డే అప్‌డేట్‌ను శ‌నివారం నిర్మాత‌లు విడుద‌ల చేశారు. అందులో భాగంగా ఫ‌స్ట్ నోటీస్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఆగ‌స్ట్ 9న మ‌హేశ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా బ‌ర్త్ డే బ్లాస్ట‌ర్‌ను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.  
 
రెగ్యుల‌ర్ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్స్‌కు భిన్నంగా విడుద‌లైన‌ ఈ ఫ‌స్ట్‌ నోటీస్ లుక్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ఇప్ప‌టి వ‌ర‌కు క‌నిపించ‌నంత స్టైలిష్ లుక్‌లో మ‌హేశ్‌బాబు క‌నిపిస్తున్నారు. ల‌గ్జ‌రీ రెడ్ క‌ల‌ర్ కారు నుంచి ఆయ‌న బ‌య‌ట‌కు వ‌స్తున్న‌ట్లు ఈ లుక్ ఉంది. స్పోర్ట్స్ ప‌ర్సెన్ స్టైల్లో చెవుల‌కు చిన్న రింగులు, పొడ‌వాటి జుట్టుతో పాటు చెవి వెన‌కాల‌ ఒక రూపాయి నాణెం టాటూతో ట్రెండ్ అవుట్ ఫిట్‌లో మ‌హేశ్ సూప‌ర్ కూల్‌గా క‌నిపిస్తున్నారు. అలాగే ఇదే పోస్ట‌ర్‌లో ముగ్గురు వ్య‌క్తులు మ‌హేశ్ ఉన్న ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోతున్న‌ట్లు కూడా క‌నిపిస్తుంది. ఈ ఫ‌స్ట్ నోటీస్ లుక్, మ‌రో తొమ్మిది రోజుల్లో విడుద‌ల కాబోతున్న‌ సూప‌ర్‌స్టార్ బ‌ర్త్ డే బ్లాస్ట‌ర్‌పై అంచ‌నాల‌ను పెంచుతుంది.
 
అలాగే పోస్ట‌ర్‌పై సినిమా రిలీజ్ డేట్ 2022, జ‌న‌వ‌రి 13 అని రివీల్ చేస్తుంది. సినిమా రిలీజ్‌కు ఇదొక చక్క‌టి రోజు. మ‌రుస‌టి రోజు భోగి పండుగ‌, అలాగే సంక్రాంతి, క‌నుమ‌.. ఇలా వ‌రుస పండుగ రోజులున్నాయి. దీనికి కొన‌సాగింపుగా వ‌స్తున్న వీకెండ్ రోజులు కూడా ఉండడంతో ఈ సినిమా స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేయనుందని తెలుస్తోంది.
- అలాగే సంక్రాంతి పండుగ మహేశ్ ల‌క్కీ సీజ‌న్‌. ఈ సీజ‌న్‌లో ఆయ‌న ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌తో సంద‌డి చేశారు. 2020లో సంక్రాంతికి విడుద‌లైన స‌రిలేరు నీకెవ్వ‌రు హయ్య‌స్ట్ గ్రాస‌ర్‌గా స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేయ‌డ‌మే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్‌.
 
మైత్రీ మూవీ మేక‌ర్స్, జీఎంబీ ఎంట‌ర్‌టైన్మెంట్‌,14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్స్‌పై  న‌వీన్ ఎర్నేని, వై.ర‌వి శంక‌ర్‌, రామ్ ఆచంట గోపీ ఆచంట నిర్మాత‌లుగా ‘స‌ర్కారువారి పాట‌’ చిత్రంలో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీత సార‌ధ్యం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి ఆర్‌.మ‌ది సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి మార్తాండ్ కె.వెంక‌టేశ్ ఎడిట‌ర్‌. ఎ.ఎస్‌.ప్ర‌కాశ్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌. ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది.
 
న‌టీన‌టులు:
మ‌హేశ్ బాబు, కీర్తి సురేశ్‌, వెన్నెల కిషోర్‌, సుబ్బ‌రాజు త‌దిత‌రులు
సాంకేతిక నిపుణులు:
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  ప‌ర‌శురాం పెట్ల‌
నిర్మాత‌లు: న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్‌, రామ్ ఆచంట‌, గోపీచంద్ ఆచంట‌
బ్యాన‌ర్స్‌: మైత్రీ మూవీ మేక‌ర్స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, 14 రీల్స్ ప్ల‌స్‌
మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ:  ఆర్‌.మ‌ది
ఎడిట‌ర్‌:  మార్తాండ్ కె.వెంక‌టేశ్‌
ఆర్ట్ డైరెక్ట‌ర్‌:  ఎ.ఎస్‌.ప్ర‌కాశ్‌
ఫైట్స్‌:  రామ్ ల‌క్ష్మ‌ణ్‌
లైన్ ప్రొడ్యూస‌ర్‌: రాజ్ కుమార్‌
కో డైరెక్ట‌ర్‌: విజ‌య రామ్ ప్ర‌సాద్‌
సి.ఇ.ఓ:  చెర్రీ

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు