ఓ రియాల్టీ షోలో గెలుపొందిన కారణంగా ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్ వచ్చిందని చెప్పడంతో అందరూ షాక్ తిన్నారు. కౌశల్ ఫ్యాన్స్ మాత్రం పొంగిపోయారు. కానీ అసలు ఈ విషయంలో ఎంత నిజముందనే దానిపై ఓ వ్యక్తి.. సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం కింద ఓ దరఖాస్తు పెట్టుకున్నాడు. ఈ దరఖాస్తుపై స్పందించిన సమాచార హక్కు చట్టం అధికారులు అందులో ఏమాత్రం నిజం లేదని తేల్చేశారు. దీంతో కౌశల్ చెప్పిన మాటల్లో ఏమాత్రం నిజం లేదని తెలిపారు.