రష్మీకి ఐటమ్ సాంగ్ ఛాన్స్ మిస్.. హంసానందినికి చేతిలో బంపర్ ఆఫర్..

బుధవారం, 18 జనవరి 2017 (10:00 IST)
''గుంటూరు టాకీస్''కు తర్వాత ఆఫర్లు లేక కష్టాలు పడుతున్న రష్మీ ప్రస్తుతం ఐటమ్ గర్ల్‌గా మారనుందని వార్తలు వస్తున్నాయి. బుల్లితెర మీద జబర్దస్త్‌తో బాగా పాపులర్ అయిన రష్మికి వెండితెర మీద మాత్రం సరైన సక్సెస్ రావట్లేదు. ఎప్పటి నుండో వెండితెర మీద స్టార్‌గా వెలిగిపోదామనుకున్న రష్మికి 'గుంటూర్ టాకీస్' తప్పించి సక్సెస్ ఇచ్చిన సినిమా లేదు. పోనీ ఐటెం సాంగ్ చేసి సిల్వర్ స్క్రీన్ మీద షార్ట్ కట్‌లో పాపులర్ అయిపోదామనుకున్న రష్మీకి ఊహించని షాక్ తగిలింది. 
 
యంగ్ హీరో రాజ్ తరుణ్ న్యూ మూవీ 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త'లో రష్మి ఐటెం సాంగ్ చేస్తుందని వార్త వచ్చింది. అయితే ఇప్పుడు రష్మి ఆ ఛాన్ మిస్సయింది. ఆ మూవీలో ఐటెం సాంగ్ చేసే ఆఫర్ రష్మి నుండి హంసానందిని కొట్టేసింది. 
 
ఇంతకుముందు హంసానందిని పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' మూవీలో ఐటెం సాంగ్ చేసి పాపులర్ అయ్యింది. తర్వాత గోపీచంద్ 'లౌక్యం ' మూవీలో హంసానందిని చేసిన ఐటెం సాంగ్‌కి మాస్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఐటెం సాంగ్‌కి రష్మి కంటే హంసానందిని బెస్ట్ ఛాయిస్ అని మేకర్స్ ఫిక్స్ అయ్యారట.

వెబ్దునియా పై చదవండి