హ్యాపీ బర్త్‌డే ఫస్ట్ లుక్ తో నో గన్, నో ఎంట్రీ అంటోన్న లావణ్య త్రిపాఠి

బుధవారం, 15 డిశెంబరు 2021 (14:15 IST)
Lavanya Tripathi
‘మత్తు వదలరా’ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో ఇటీవల ఓ చిత్రం ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రముఖ కథానాయిక లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రానికి ‘హ్యాపీ బర్త్‌డే’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. బుధవారం హీరోయిన్ లావణ్య త్రిపాఠి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్‌ని చిత్రయూనిట్ విడుదల చేసింది. 
 
- నరేష్ ఆగస్త్య, వెన్నెల కిషోర్, సత్య ముఖ్య తారలుగా నటిస్తున్న ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు. 
 
- తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో లావణ్య త్రిపాఠి మిషన్ గన్ పట్టుకుని ఫైరింగ్ చేస్తోంది. చిత్ర టైటిల్ చుట్టూ గన్స్ చూపిస్తూ.. పక్కన ‘నో గన్, నో ఎంట్రీ’ అనే క్యాప్షన్ చూస్తుంటే ఇది ఏ తరహా చిత్రమో ఇట్టే అర్థమవుతోంది. టోటల్‌గా ఫస్ట్ లుక్‌తోనే ప్రేక్షకులకి మంచి పార్టీ రెడీ అవుతుందనేలా ఈ పోస్టర్‌ని డిజైన్ చేశారు. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ఈ చిత్రం ఏకధాటిగా షూటింగ్ జరుపుకుంటోంది.    
 
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘మా హీరోయిన్ లావణ్య త్రిపాఠికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆమె బర్త్‌డే రోజే.. ‘హ్యాపీ బర్త్‌డే’ టైటిల్‌ను, ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. రీసెంట్‌గానే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశాం. ఈ చిత్రంతో దర్శకుడు రితేష్ రానా ప్రేక్షకులను హిలేరియస్‌గా ఎంటర్‌టైన్ చేయబోతున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. మంచి తారాగణం కుదిరింది. టెక్నికల్‌గానూ హై స్టాండర్డ్స్‌లో ఈ చిత్రం ఉంటుంది. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు కాలభైరవ సంగీతం, సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు..’’ అని తెలిపారు.  
 
లావణ్య త్రిపాఠి, నరేష్ ఆగస్త్య, వెన్నెల కిషోర్, సత్య తదితరులు నటించిన ఈ చిత్రానికి
ప్రొడక్షన్ డిజైనర్: నార్ని శ్రీనివాస్,

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు