సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అస్సలు పడదు. వర్మ చేసిన కామెంట్స్‌కు పవన్ ఫ్యాన్స్ వ్యతిరేకంగా ట్వీట్స్ చేస్తుంటారు. ఇటీవల సర్దార్ గబ్బర్ సింగ్ స్టార్, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జోలికి ఇక వెళ్ళే ప్రసక్తే లేదంటూ వర్మ ట్వీట్ కూడా చేశాడు.
తాను మంచి ఉద్దేశంతో మాట్లాడుతున్నప్పటికీ ప్రతి ఒక్కరూ తన వ్యాఖ్యల్ని అపార్థం చేసుకుంటున్నారని పవన్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి గతంలో వర్మ ట్వీట్ చేశాడు. అంతటితో ఆగకుండా.. ఇకపై జీవితంలో పవన్‌కల్యాణ్ గురించి ఎలాంటి ట్వీట్ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. చివరిగా బై.. బై పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ అంటూ వర్మ ట్వీట్ చేశాడు.
ఇప్పుడిప్పుడే పవన్ కల్యాణ్ ప్రసంగం చూశాడు. అతను చెప్పిన విషయం చాలా బాగా అర్థమైంది. పవన్ ఎంచుకున్న మూడంచెల ఉద్యమ మార్గం ఉత్తమం. పవన్ తెలివిగా తీసుకున్న ఉద్యమ ప్రణాళిక అంత తొందరగా ఎవరికీ అర్థం కాకపోవచ్చు. పవన్ లాంటి నాయకుడు ఉండటం ఏపి ప్రజల అదృష్టం.. అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. ఇక రామ్ గోపాల్ ట్వీట్స్ చూసి పవన్ కల్యాణ్ షాక్ అయ్యారు. ఇంకా ఎప్పుడూ ఏకిపారేసే వర్మ పవర్ స్టార్‌పై ప్రశంసలు కురిపించడం పట్ల సంబరాలు చేసుకుంటున్నారు.