ఈ వృద్ధుడు 'కబాలి' స్టామినా రూ.600 కోట్లా...? 60 ఏళ్ల వృద్ధుడు చిరు స్టామినా ఎంతో...?

గురువారం, 4 ఆగస్టు 2016 (14:36 IST)
ఆయన 65 ఏళ్ల వృద్ధుడు. జస్ట్ అలా చేయి తిప్పి వణక్కం అన్నాడో బిగ్ స్క్రీన్ దద్దరిల్లుతుంది. ఆయనే దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్. కబాలి చిత్రంతో 65 ఏళ్ల వయసులోనూ కలెక్షన్లు సునామీ సృష్టిస్తున్నారు. కబాలి చిత్రం రూ. 600 కోట్లు దాటిపోయిందంటూ ప్రచారం జరుగుతోంది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.... చిత్రం విడుదలై 10 రోజులయింది. ఈ 10 రోజుల్లోనే రూ. 600 కోట్లు లాగేసిందని కోలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే బాహుబలి రికార్డును కబాలి బద్ధలు కొట్టేసినట్లే. 
 
అంతేకాదు సల్మాన్ ఖాన్ సుల్తాన్ కలెక్షన్లకు దగ్గరకు వస్తున్నట్లే. సుల్తాన్ చిత్రం రూ. 550 కోట్లు వసూలు చేసింది. ఐతే గణాంకాలు వేరే లెక్కలు చెపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కబాలి విడుదలైన థియేటర్లలో అమ్ముడయిన టిక్కెట్ల ప్రకారం కబాలి చిత్రం సుమారుగా రూ. 300 కోట్లు వసూలు చేసినట్లు తేలింది. మరి 600 కోట్లు అంటూ జరుగుతున్న ప్రచారం వెనుక అసలు కథ ఏమిటో తెలియాల్సి ఉంది. ఇదిలావుంటే ప్రస్తుతం 150వ చిత్రంలో నటిస్తున్న 60 ఏళ్ల మెగాస్టార్ చిరంజీవి పైనా ఇప్పుడు దక్షిణాది సినీ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. కబాలి రికార్డును చిరంజీవి క్రాస్ చేస్తారా అనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి