వామ్మో వాన... హైదరాబాద్ ట్రాఫిక్ జాం... దాన్నెక్కడం బాగుంది: నితిన్ ట్వీట్

శనివారం, 22 జూన్ 2019 (19:53 IST)
సాధారణంగా హైదరాబాద్ ట్రాఫిక్ పద్మవ్యూహన్ని తలపిస్తుంది. ఒక మాదిర వర్షం పడితే వాహనదారుల కష్టాలు వర్ణనాతీతం. భారీ వర్షం కురిస్తే ఇక అంతేసంగతులు. శుక్రవారం హైదరాబాద్ పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసి రహదారులు అన్నీ జలమయం అయ్యాయి. దీంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ పలువురు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
 
దీంతో తమ గమ్య స్థానాలకు చేరడానికి మెట్రో రైలు సర్వీసులను ఆశ్రయించారు. హీరో నితిన్ షూటింగ్ ముగించుకుని త్వరగా ఇంటికి వెళ్లాలనుకున్నాడు. రోడ్లన్నీ స్తంభించి పోవడంతో తన కారుని అక్కడే వదిలి మెట్రో ట్రైన్ ఎక్కారు. నితిన్ మెట్రో రైలులో చూసినవారంతా సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఇదే అంశాన్ని నితిన్ తన ట్విట్టర్లో పోస్టు చేశాడు. మెట్రో ఎక్కడం చాలా బాగుందని పేర్కొన్నాడు నితిన్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు