'అలా ఎలా' చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన హీరోయిన్ హెబ్బా పటేల్. 'కుమారి 21 ఎఫ్', 'ఆడోరకం ఈడోరకం', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' వంటి చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్య సరైన ఆఫర్స్‌లేని హెబ్బాకి తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ తలుపు తట్టిందట.
ఈ చిత్రంలో హెబ్బా శ్రీలక్ష్మీ అనే పాత్ర చేయనుండగా, ఏకంగా 24 ముద్దులు ఇచ్చేందుకు రెడీ అయిందట. దీనిపై హెబ్బా మాట్లాడుతూ.. 'కుమారి 21 ఎఫ్... తరహాలోనే '24 కిసెస్'లో కూడా నాది చాలా బోల్డ్ క్యారెక్టర్. ఆ సినిమాకు ఎంత క్రేజ్ వచ్చిందో, దీనికి కూడా అంతే క్రేజ్ వస్తుంది'అని తెలిపింది.