సక్సెస్‌లు వస్తుండగానే.. పారితోషికాలు పెంచడం మామూలే. అందులో మరో భామ చేరింది. సుకుమార్ బేనర్‌లో 'కుమారి 21ఎఫ్' చిత్రంలో పరిచయమైన నటి హెబ్బా పటేల్. ఈ చిత్రం సక్సెస్ అయ్యేసరికి అమ్మడికి పలు చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. తాజాగా 'ఎక్కడికి పోతావే చిన్నవాడా..' చిత్రంలో నటించింది. ముగ్గురి హీరోయిన్లలో ఒకరిగా చేసిన ఈమె నటనకు పెద్దగా కనెక్ట్ కాకపోయినా.. ఈ చిత్రం హిట్‌తో తన రేటు పెంచేసుకుంది.
'కుమారి 21ఎఫ్' చిత్రంలో లిప్‌కిస్‌లు ఇస్తూ... ఇప్పటి ఫాస్ట్ అమ్మాయిగా నటించి మెప్పింది. కానీ.. 'ఎక్కడికి..' సినిమాలో ఆమె చేసిన నటన ఎబ్బెట్టుగానూ... పెద్దగా ఆకర్షణలేని అమ్మాయిగా కన్పించడంతో.. యూత్ నిరాశ చెందారనే చెప్పాలి. కానీ ఆ చిత్ర సక్సెస్‌తో ఏకంగా తన రేటును అరవై లక్షలకు పెంచేసింది. కానీ ఆమె పెంచిన రేటు ఇచ్చేందుకు నిర్మాతలు ముందుకురావాలి కదా. లక్కీ హీరోయిన్‌గా పేరు ఉన్నా... అవకాశాలు వస్తేనే ఆమె రేటుకు విలువ వుంటుంది. ప్రస్తుతం ఆమె చేస్తున్న చిత్రాలు పెద్దగా లేవు.