ఉరీ ఘటన నేపథ్యంలో పాకిస్థాన్ నటీనటులు వెంటనే భారత్ వదిలి వెళ్లిపోవాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ కళాకారులు తీవ్రవాదులు కారని, వారికి పాక్ నుంచి భారత్ వచ్చేందుకు వీసాలు, అనుమతులు ప్రభుత్వమే ఇస్తుందని శుక్రవారం ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. కళాకారుల్ని, తీవ్రవాదుల్ని ఒకేలా చూడవద్దన్నారు.
ఈ విషయంపై సల్మాన్ ఖాన్, రాధికా ఆప్టే తదితర సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను చెప్పారు. తాజాగా బాలీవుడ్ నటి హేమమాలిని ఈ విషయం గురించి మీడియా అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో స్పందించారు. ''వివాదాస్పదమైన ఈ ప్రశ్నకు సమాధానం చెప్పదలచుకోవడం లేదు.